type='text/javascript'/>

LATEST UPDATES:

 

| ]


పూర్తయిన అంత్యక్రియలు / Sep 04 09
కడపజిల్లా: ఇడుపులపాయలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంతిమయాత్ర ఘనంగా సాగింది. ఎటు చూసినా జనమే జనం. బంధువులు, అభిమానులు, మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతోపాటు అత్యధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. హైదరాబాదు నుంచి హెలికాఫ్టర్‌లో తీసుకువచ్చిన భౌతికకాయాన్ని పేటికలో ఉంచి ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్ళారు. ఆ వాహనంపైన వైఎస్ సతీమణి విజయలక్ష్మి, కుమారుడు జగన్మోహన రెడ్డి, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ కుమార్, మనమళ్లు, మనుమరాళ్లు, తమ్ముడు వివేకానందరెడ్డి ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. సిఎం భౌతిక కాయానికి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. వీరితో పాటుగా రాష్ట్ర అధికారులు, అనధికారులు కూడా పాల్గొన్నారు. వైఎస్ జగన్ విలపిస్తూ జనవాహినికి అభివాదం చేశారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు.