దాసరి నారాయణరావు ఇంతవరకూ 148 చిత్రాలకు దర్శకత్వం వహించిన గిన్నెస్ రికార్డు సాధించారు. 149వ చిత్రంగా 'యంగ్ ఇండియా' అనే చిత్రాన్ని ఇటీవలే ఆయన ప్రకటించారు. అంతా కొత్త తారలతో ఆయన ఈ చిత్రాన్ని త్వరలోనే తెరకెక్కించనున్నారు. ఆసక్తికరంగా ఆయన 150వ చిత్రం వై.ఎస్. నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసే చిత్రమే అవుతుందని అంటున్నారు. అధికారికంగా ఇంకా ఈ విషయం ధ్రువీకరణ లేదు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్. పాత్రను డాక్టర్ ఎం.మోహన్ బాబు పోషించనున్నారనీ, వై.ఎస్.తండ్రి రాజారెడ్డి పాత్ర కోసం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒప్పించాలని అనుకుంటున్నారనీ చెబుతున్నారు. మోహన్ బాబు, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 'పెదరాయుడు' అప్పట్లో సంచనల విజయం సాధించింది. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ కాంబినేషన్ ను పునరావృతం చేయాలని ఆనుకుంటున్నట్టు సమాచారం. |
|
|
Also See This Topics : Entertainment